![]() |
![]() |
.webp)
రష్మీ అంటే చాలు ఆమె సోషల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. మూగ జీవాలను కూడా బాగా చూసుకుంటూ ఉంటుంది.రీసెంట్ గా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి వాసంతిని, 15 ఏళ్ల ముగ్గురు మైనర్ బాలురు కలిసి హత్యచారం చేసిన దారుణమైన ఘటన గురించి తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు గడిచినా ఇంత వరకు బాలిక మృతదేహం దొరకలేదు. ఇక ఘటన రష్మీ స్పందించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
.webp)
‘వాళ్లు పెద్ద వాళ్లలా హత్యాచారం చేసినప్పుడు వాళ్లకు పడే , శిక్ష కూడా పెద్ద వాళ్లకు ఎలా వేస్తారో అలాగే ఉండాలి. ముఖ్యంగా వాళ్లు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాపపడటం లేదు. కాబట్టి, వాళ్లు కచ్చితంగా మైనర్లు కాదు. మైనర్లు అనే ఒకే ఒక్క కారణంతో తక్కువ శిక్షతో బయటపడడం కరెక్ట్ కాదు’ అని ట్వీట్ చేసింది. ఈ పోస్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎంవోకు ట్యాగ్ చేసింది. అయితే రష్మీ చేసిన పోస్టుకు పలవురు నెటిజన్స్ కూడా రియాక్ట్ అవతూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. యూట్యూబర్ హనుమంతు విషయంలో సాయి ధరమ్ తేజ్ ముందుకొచ్చి ఎలా రియాక్ట్ అయ్యారో రష్మీ కూడా ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు.
![]() |
![]() |